NRI TDP

NRI TDP: ఛార్లెట్‌లో ఘనంగా టిడిపి ఎమ్మెల్యేల మీట్‌ అంట్‌ గ్రీట్‌

NRI TDP: ఛార్లెట్‌ లో ‌ ఎన్నారై టీడిపి నాయకులు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ 43వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను కూడా నిర్వహించారు. వర్కింగ్‌ డే అయినప్పటికీ దాదాపు రెండు వందల మంది ఛార్లెట్ ఎన్నారైలు పాల్గొన్నారు. చార్లెట్‌లోని వెడ్డింగ్టన్‌ రోడ్డులో ఉన్న బావార్చి ఇండియన్‌ గ్రిల్‌ రెస్టారెంట్ లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని అప్పటి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీరామారావు స్థాపించారని, సినిమానటుడి పార్టీ అన్నవారే చివరకు ఈ పార్టీలో చేరి అధికారాన్ని అందుకున్నారని చెప్పారు.

NRI TDP

ఈరోజు అమెరికాలో ఇన్ని లక్షలమంది తెలుగువాళ్ళు ఐటీ రంగంలో ముందున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని చెప్పారు. ఆయన విజనరీ ఏ రాజకీయవేత్తకి లేదని ఆయన తన ప్రసంగంలో ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆయనకు ఎన్నారైలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించేందుకు ముందుకువచ్చినట్లే రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిబాటలో పయ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రగతికోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. మరో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా ఎన్నారైలు రాష్ట్ర ప్రగతికోసం ముందుకురావాలని కోరారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, పథకాలను మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

nri tdp

ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, సతీష్ నాగభైరవ, రాజేష్ వెలమల మరియు ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడిపితోపాటు, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చివరన ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

nri tdp

 

  • Beta

Beta feature

  • Beta

Beta feature

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *