Murder: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలోని శివారులో ఏప్రిల్ 1వ తేదీన జరిగిన గుర్తు తెలియని మహిళ హత్యను పోలీసులు చేధించారు. తాండూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు.
ఏప్రిల్ 1వ తేదీన పెద్దేముల్ మండల కేంద్రంలోని శివారులో గుర్తు తెలియని మహిళ హత్య ఘటనలో జిల్లా పోలీసు యంత్రాంగం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో గుర్తుపట్టిన మృతురాలు కొడుకు అశోక్ తాండూరు జిల్లా ఆస్పత్రిలో మృతదేహాన్ని గుర్తుపట్టి మృతురాలు తన తల్లి యశోద అని తెలపడం జరిగిందన్నారు. పరిగిలో కూలీ పనులు చేసుకునే తన తల్లి యశోద పరిగి మండలానికి చెందిన గోపాల్, అనితలతో తన తల్లి వెళ్ళలేదని వారిద్దరిపై అనుమానం ఉన్నట్లు మృతురాలి కొడుకు అశోక్ ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Crime News: రైలులో మైనర్‌కు లైంగిక వేధింపులు.. వీడియో చిత్రీకరించిన దుండగుడు
Murder: ఆ దిశగా గోపాల్, అనితలను అదుపులోకి తీసుకొని విచారించడంతో మృతురాలు యశోద తన అవసరం నిమిత్తం అనిత దగ్గర 6 వేల రూపాయలను అప్పు తీసుకుందని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో తనతో పాటు సహజీవనం చేసే గోపాల్ సహాయంతో యశోదను పరిగి నుంచి పెద్దేముల్ వరకు బైక్‌పై తీసుకుని వచ్చి ముగ్గురు మద్యం సేవించిన తర్వాత చీర కొంగుతో యశోదను గొంతు నుమిలి హత్య చేసి మెడలో ఉన్న పల్లపూసల దండ, ముక్కు కమ్మలు, కడియాలు తీసుకున్నారు.
తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రోల్ యశోద ముఖంపై పోసి నిప్పు అంటించినట్లు నేరాన్ని ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు హత్య చేసి హైదరాబాద్ పారిపోయిన నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నారాయణ రెడ్డి వివరించారు.

