Coolie And War 2 Clash: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రజినీ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘కూలీ’ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఓ డైనమిక్ పోస్టర్‌తో వెల్లడించారు.అయితే, అదే రోజున బాలీవుడ్ క్రేజీ స్పై థ్రిల్లర్ ‘వార్-2’ కూడా రిలీజ్ కానుంది. హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వార్ తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు. రజినీ ‘కూలీ’ విజయ జెండా ఎగురవేస్తాడా? లేక ‘వార్-2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు బిగ్ బడ్జెట్ మూవీస్ మధ్య పోటీ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది. మరి బాక్సాఫీస్ బరిలో విజేత ఎవరో చూడాలి!
