MS Dhoni: ధోనీ 2025 ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో ఆడేదీ లేనిదీ అక్టోబరు 31 ముందు క్లారిటీ రానుంది. ఈ మేరకు ధోనీ తమకు సమాచారమిచ్చాడని చెన్నయ్ సూపర్ కింగ్స్ సీఈవో కాశి విశ్వనాథన్ తెలిపాడు. నెక్స్ట్ సీజన్లో ధోనీ చెన్నయ్ తరఫున ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ లో ధోనీ ఫ్యూచర్ ఏంటి..? ఐపీఎల్ 2025 లో ధోనీ ఆడతాడా ? లేదా..? ఇప్పటికీ క్లియర్ కట్ గా తెలియడం లేదు. మనసులో మాట ఇదీ అని ధోనీ చెప్పడు. ఈ సీజన్ వరకు ఆడి తప్పుకుంటాడా అంటే ఆన్సర్ ఎవరికీ తెలియదు.. ఐపీఎల్ రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేండ్లు పూర్తయిన క్రికెటర్లను అన్ క్యాప్ డ్ ప్లేయర్లుగా పరిగణిస్తారు. ఇప్పుడు రూల్స్ ప్రకారం ధోనీ కూడా ఇదే కేటగిరీ కిందకు వస్తాడు. మరి ధోనీని రూ. 4 కోట్లకు అన్ క్యాప్ డ్ కేటగిరీలో చెన్నై రిటైన్ చేసుకుంటుందా..? అంటే సమాధానం తెలియడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోనీ ఫ్యాన్స్ కు ఉత్కంఠను కలిగించేదిగా ఉందీ విషయం. ఇటీవలే అమెరికా టూర్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చిన ధోనీ ఎట్టకేలకు నోరు విప్పడం విశేషమే.
అయితే ధోనీ ఇచ్చిన సమాచారంపై క్లారిటీ లేదు. ఏ విషయమూ అక్టోబరు 31 ముందు చెబుతానన్న ధోనీ మరిన్న ఊహాగానాలకు తావిచ్చాడు. మైదానంలోనే కాదు.. బయట కూడా కూల్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఉత్కంఠలో ముంచేస్తునానడు ధోనీ. అన్ క్యాప్ డ్ కేటగిరిలో ధోనీ వస్తే.. మరో యువ ఆటగాడికి అన్యాయం జరుగుతుందేమోనన్న డౌట్ తో ధోనీ ఉన్నాడా..? పోనీ వేలంలోకి వస్తే.. ఈ వయసులోనూ ధోనీని తన్నుకుపోయేందుకు అన్ని ఫ్రాంచైజీలు రెడీనే. తాజాగా జులపాల జట్టును వదిలేసి సరికొత్త స్టయిల్లో బాలీవుడ్ హీరోని తలపిస్తున్న ధోనీని చూస్తుంటే ఈ సీజన్ ఆడేలాగే కనిపిస్తున్నాడు.
ధోనీ 2025 ఐపీఎల్ పార్టిసిపేషన్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంటే, టీ10 గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండర్, ఛైర్మన్ షాజీ ఉయ్ ముల్క్ కూడా ధోనీ మాట కోసం వెయిట్ చేస్తున్నాడు. సమీప భవిష్యత్తులో ఈ టీ10 లీగ్ లో ధోనీ పాల్గొంటాడని హోప్స్ పెట్టుకున్నాడు. రిటైరైన మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఈ టీ10 లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ విషయమైనా క్లారిటీ రావాలంటే అక్టోబరు 31 వరకూ ఆగాల్సిందే. అంత వరకూ ధోనీ అభిమానులకు ఉత్కంఠ తప్పదు.

