NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘వార్-2’ షూటింగ్‌ను వేగంగా ముగించిన తారక్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో తన కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవల ‘దేవర’ జపాన్‌లో బిగ్ రిలీజ్ అయ్యింది. అక్కడ ప్రమోషన్స్‌లో రచ్చ చేసి ఇండియాకు వచ్చిన ఎన్టీఆర్.. తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో చీఫ్ గెస్ట్‌గా సందడి చేశాడు.
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ఈ మూవీ ఈవెంట్‌లో తారక్ హైలైట్‌గా నిలిచాడు.ఈ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీతో తన తదుపరి చిత్రం ఉంటుందని.. ఇది నెక్స్ట్ లెవెల్ రేంజ్‌లో ఉండబోతుందని చెప్పాడు. త్వరలోనే నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపాడు.
Also Read: Hrithik Roshan: తారక్ పై హృతిక్ వైరల్ కామెంట్స్!
NTR: దీంతో ఈ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రాబోతుందనే టాక్ ఫిక్స్ అయిపోయింది.ఇటీవల నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో.. నెల్సన్‌తో తన నెక్స్ట్ మూవీ ఉంటుందని, ఓ బిగ్ హీరో ఈ ప్రాజెక్ట్‌లో ఉంటాడని స్పాయిలర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అప్డేట్‌తో అది కన్ఫర్మ్ అయింది. ఈ కాంబో ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్‌కు తీసుకెళ్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో వేచి చూడాలి!