Missing Case: సికింద్రాబాద్ నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. న్యూ బోయిన్‌పల్లిలో ఏడుగుళ్ల సమీపంలో నివసించే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్‌తో పాటు సంధ్య అనే కుటుంబ సభ్యురాలు గురువారం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం.
మహేశ్ స్థానికంగా నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఉమా సోదరి సంధ్య ఇంటికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆరుగురు కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వారు ఆటో రిక్షా బుక్ చేసుకొని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ (ఇమ్లీబన్ స్టాప్) వరకు వెళ్లినట్లు పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ద్వారా వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Crime On Train Washroom: దారుణం.. కదులుతున్న రైలులో మైనర్ బాలికపై ‘అత్యాచారం’
వారు అక్కడి నుంచి ఎటు వెళ్లారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో ఉమా సోదరుడు భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అనుమానాస్పద కోణాల్లో విచారణ సాగుతోంది. బోయిన్‌పల్లి పోలీసులు అన్ని దిశల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.