MLC Election 2025:హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంఐఎం, బీజేపీ ప్రకటించాయి. అయితే కాంగ్రెస్, పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా పోటీ చేసే ఉద్దేశంలో లేదు. దీంతో ప్రధాన పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యనే ఉంటుంది. ఎంఐఎం తన అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ను ప్రకటించగా, బీజేపీ తన అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించింది.
MLC Election 2025:ఇప్పటివరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వారిద్దరూ రంగం నుంచి తప్పుకుంటే ఎంఐఎం, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇదిలా ఉండగా, మొత్తం ఓటర్లు 110 మంది ఉండగా, వారిలో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు.
MLC Election 2025:ఎంఐఎం నుంచి 1 ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు కలిపి మొత్తంగా 49 మంది ఓటర్లు మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు కార్పొరేటర్లు కలిపి 14 మంది ఓటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి 22 మంది ఓటర్లు ఉన్నారు.
MLC Election 2025:ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ 2009, 2016లో కార్పొరేటర్‌గా, 2019లో ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, 2023లో ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీగా ఈ ఎన్నికల్లో ఎంఐఎం అవకాశం కల్పించింది. కాంగ్రెస్ కూడా ఎంఐఎంకు మద్దతిచ్చే అవకాశం ఉండటంతో ఆయన గెలుపు ఈజీ అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ బీజేపీకి క్రాస్ ఓటింగ్ పడితే ఫలితాలు మారే అవకాశం లేకపోలేదు.