Jagan Killed Paritala: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిటాల రవి హత్య ఒక చెరగని మచ్చ. 2005లో అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్యకాండ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అతి పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం హస్తం ఉందన్న ఆరోపణలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దర్యాప్తు సందర్భంగా జగన్‌ను విచారించిన సంగతి కూడా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తాజా వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ పార్టీ…. హత్యలు, శవాలతో రాజకీయం చేసే సంస్కృతిని సునీత తీవ్రంగా తప్పుబడుతూ, పరిటాల రవి హత్యలో జగన్ పాత్రను మరోసారి తెరపైకి తెచ్చారు.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మజ్జిగ లింగమయ్య అనే వైసీపీ సానుభూతిపరుడి మరణం రాజకీయ దుమారం రేపింది. మార్చి 30న జరిగిన ఘర్షణలో లింగమయ్య తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ సంఘటనను వైసీపీ నేతలు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని సునీత ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నుంచి ఇప్పుడు లింగమయ్య మరణం వరకూ, వైసీపీ శవ రాజకీయాలతోనే అధికారంలోకి రావాలని చూస్తోందని ఆమె విమర్శించారు. ఈ క్రమంలోనే ఆమె… పరిటాల రవి హత్య కేసును ప్రస్తావిస్తూ, జగన్‌పై సీబీఐ విచారణ జరిగిందనీ, రవి హత్యలో జగన్ పాత్ర గురించి ప్రజలకు సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసులో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ జగన్ పాత్ర గురించి సీబీఐ విచారణ స్పష్టం చేసిందని సునీత పేర్కొన్నారు.
Jagan Killed Paritala: వైసీపీ రాజకీయ విధానాలను తీవ్రంగా విమర్శించారు పరిటాల సునీత. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయ హత్యలు మొదలైతే, జగన్ దాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య నుంచి లింగమయ్య మరణం వరకూ, వైసీపీ నీచ రాజకీయాలకు పరాకాష్ఠగా నిలుస్తోందని మండిపడ్డారు. లింగమయ్య హత్యను పరిటాల కుటుంబంపై నెట్టాలని తోపుదుర్తి బ్రదర్స్ చూస్తున్నారనీ, జగన్ సాయంతో ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటున్నారనీ.. ఇది వారి నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారామె.
Also Read: RK Roja Arrest: ‘ఆడుదాం ఆంధ్రా’లో ‘ప్యాలెస్’కి వాటాలు వెళ్లాయా?
ఈ సందర్భంగా పరిటాల రవి హత్యను ప్రస్తావిస్తూ, 20 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదనీ… జగన్ ఈ హత్యలో భాగస్వామి అని సీబీఐ విచారణలో తేలిందనీ.. అదే జగన్ రెడ్డి ఇప్పుడు లింగమయ్య చావుతో రాజకీయం చేయాలని చూస్తున్నారనీ ధ్వజమెత్తారు. జగన్ శుక్రవారం జిల్లాకు రాబోతున్న నేపథ్యంలో, సూట్‌కేసు బాంబు, కారు బాంబు, పరిటాల రవి హత్యలపై సమాధానం చెప్పకుండా ఇక్కడ అడుగు పెట్టొద్దని సునీత హెచ్చరించారు. సునీత వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ రాప్తాడు పర్యటన రాజకీయంగా హీటెక్కిస్తోంది.
Jagan Killed Paritala: రాజకీయ వర్గాల్లో సునీత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పరిటాల రవి హత్య కేసు, సీబీఐ విచారణ, జగన్ పాత్రపై సునీత స్పష్టమైన ఆరోపణలు చేయడం వైసీపీని ఇరకాటంలో పడేసింది. జగన్ రాష్ట్రవ్యాప్తంగా శవ రాజకీయాలు చేస్తున్నారంటూ సునీత నిప్పులు చెరిగారు. ఈ సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠగా మారాయి. జగన్ ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.