Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కుమార్తె పై కన్నతల్లి కేసు పెట్టేందుకు సిద్ధమవటం దానికి పోలీసులు సహకరించి వేధింపులకు దిగడంతో మౌనిక అనే యువతి విజయవాడలో సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. అయితే, వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న వెంకటాద్రి మృతురాలు మౌనిక చనిపోయే ముందు ఫోన్ పే చేయించుకున్న వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, మౌనిక తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి రమాదేవి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అలాగే, తండ్రి చనిపోగా వచ్చిన డబ్బును కూడా అతనికి ఇచ్చేందుకు ప్రయత్నించడంతో ఇద్దరు మధ్య వివాదం చెలరేగింది.
దీంతో కుమార్తె మౌనికపై తల్లి రమాదేవితో కలిసి ఉంటున్న వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, పోలీసులు స్టేషన్లో మౌనికను ఆమె భర్తని ఉంచడంతో పాటు డబ్బులు ఫోన్ పే చేయించుకొని మళ్లీ స్టేషనుకి రావాలని వేధింపులకు దిగడంతో మనస్థాపానికి గురైన మౌనిక ఆత్మహత్య చేసుకుంది.

