Cm revanth: మేం ఇక ఢిల్లీకి రాబోం, ప్రధాని మోదీ మా గల్లీకి రావాలి

Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ హక్కుల కోసం ధర్మయుద్ధాన్ని ప్రకటించారు. “మేం ఇక ఢిల్లీకి రాబోం, ప్రధాని మోదీ మా గల్లీకి రావాలి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తాము పోరాడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం అంగీకరించాలి

రాజకీయంగా బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “మేము ఇప్పుడు సయోధ్యకు వచ్చాం.. కానీ మా డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోతే.. మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపాలని కోరారు.

ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం

బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే, భవిష్యత్తులో మరింత గట్టి పోరాటానికి సిద్ధంగా ఉంటామని రేవంత్ హెచ్చరించారు. “బీసీల హక్కులను హరిసించాలనే ధ్యేయంతోనే మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కేంద్రం స్పందించకపోతే, ఎర్రకోటపై జెండా ఎగురవేసే స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తాం” అని ఆయన తేల్చిచెప్పారు.

బీసీల ఐక్యతే విజయానికి మార్గం

బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని రేవంత్ పిలుపునిచ్చారు. “బీసీ హక్కుల కోసం మనం ఒక్కటిగా ఉండాలి. మన డిమాండ్లను నెరవేర్చుకునే వరకు వెనక్కి తగ్గకూడదు” అంటూ బీసీ సామాజిక వర్గాలను ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర & బీసీ హక్కులపై కాంగ్రెస్ తీర్మానం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో ఆయన దేశంలోని ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్నారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు స్పష్టంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో, దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం.

కులగణనపై రాహుల్ హామీ

దేశంలో బీసీ హక్కుల పరిరక్షణ కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ మాటను నిలబెట్టుకునేలా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే దీనిపై తీర్మానం చేసి ముందడుగు వేసింది. ఫిబ్రవరి 4ను ‘సోషల్ జస్టిస్ డే’గా జరుపుకోవాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *