Diesel Price

Diesel Price: ఆ రాష్ట్రంలో డీజిల్ ధర పెరిగింది.. ఎందుకంటే..

Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. దీనికి కారణం ఆయిల్ కంపెనీలు ధరలను పెంచకపోవడమే. అయితే, రాష్ట్రాలు స్థానికంగా డీజిల్, పెట్రోల్ పై టాక్స్ విధించే వెసులుబాటు ఉంది. దీంతో చాలా రాష్ట్రాలు డీజిల్, పెట్రోల్ పై టాక్స్ విధిస్తున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు వివిధ రాష్ట్రాల్లో రకరకాలుగా ఉంటాయి.

ఇప్పుడు బెంగళూరులో డీజిల్ ధరలు పెంచారు. ఇంతకు ముందు బెంగళూరులో డీజిల్ ధర రూ. 88.99, కానీ ఇప్పుడు దానిని రెండు రూపాయలుపెంచారు. దీంతో ఒక లీటరు డీజిల్ ధర రూ91.02గా ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల పాలు, విద్యుత్ ఛార్జీలను కూడా పెంచింది. ఇలా వరుస ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రజలు కోపంగా ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని బిజెపి యోచిస్తోంది.

Also Read: Traffic Rules: మీ వాహ‌నానికి పెండింగ్ చ‌లాన్లు ఉన్నాయా? వెంట‌నే చెల్లించండి లేకుంటే చుక్క‌లే

Diesel Price: రాష్ట్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మా నిరసన ఉంటుంది అని బిజెపి తెలిపింది. ఇదిలా ఉండగా, కర్ణాటక ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలలోని ధరలను ప్రస్తావిస్తూ ధరల పెరుగుదలను ప్రత్యేకంగా వివరించింది. దీని ప్రకారం, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన హోసూర్‌లో ఒక లీటర్ డీజిల్ ధర రూ.94.42. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి అన్ని రాష్ట్రాలు ప్రస్తుత కర్ణాటక ధర కంటే ఎక్కువ ధరకు డీజిల్ అమ్ముతుండటం గమనార్హమని ప్రభుత్వం చెబుతోంది.

చెత్తకు కూడా పన్ను
బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఇళ్ళు,దుకాణాలనుంచి వచ్చే చెత్తపై పన్ను విధించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి బిబిఎంపి బడ్జెట్‌లో కూడా ఒక ప్రకటన చేశారు. దీని ద్వారా, BBMP 600 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *