Pawan Kalyan: రాష్ట్ర అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు నాయుడు చూపిస్తున్న కృషిని ప్రశంసిస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. ప్రజలకు మేలు చేసే నాయకత్వాన్ని సమర్థించడమే నా లక్ష్యం,” అని ఆయన అన్నారు.
స్వర్ణాంధ్ర వైపు ముందుకు
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రంగా మారుతోంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇంత బలమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈరోజు చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్రం ఏమైపోయేది?” అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుల చేతనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
సీఎం చంద్రబాబు ఎదుగుదల – ఆదర్శం
“చంద్రబాబు కూడా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు. అందరూ ఎదగాలన్నదే ఆయన ఆకాంక్ష. నా ఆశయమూ అదే,” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుండి నడిపించే నాయకులకే ప్రజలు మద్దతుగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయాలని, ప్రజలు, పాలకులు కలసికట్టుగా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చరు.