Mahaa Vamsi: తెలుగుదేశం పార్టీ పేరు చెబితే తెలుగు పవర్ తెలుస్తుంది. తెలుగోడు అంటే టీడీపీకి ముందు . . టీడీపీకి తరువాత అని చెప్పుకునేలా తెలుగు ప్రజలకు ప్రపంచంలోనే బలమైన గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారకరామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో విమర్శలు. సినిమావోడు అంటూ ఎగతాళి. కానీ , మద్రాసీలుగానే ప్రపంచానికి తెలిసిన తెలుగు ప్రజలు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తరువాత తెలుగోడిగా చెయ్యెత్తి జైకొట్టించుకున్నారు. మద్రాసీ అంటూ పాతుకుపోయిన ముద్రను 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెరిపేసింది . తెలుగు భాష.. తెలుగు ప్రజలు అంటూ ప్రత్యేకమైన గుర్తింపు దేశవ్యాప్తంగానే కాదు . . ప్రపంచం నలుమూలలా వచ్చింది.
స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అనే సెంటిమెంట్ తో దశాబ్దాలుగా తెలుగునేలను ఏలిన పార్టీని కేవలం తొమ్మిది నెలల్లో నెలకు దించడమే కాదు.. తెలుగు ప్రజల్లో చైతన్యం ఎంత ఉందనేది స్పష్టంగా దేశ ప్రజలకు కనిపించేలా చేసింది తెలుగుదేశం పార్టీ. రాజకీయం అంటే తెలీని అట్టడుగు వర్గాల ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యాన్ని . . తమ హక్కులను తాము తెలుసుకునేలా చేసింది టీడీపీ . ఒడిదుడుకులు.. ప్రాంతీయ పార్టీగా ఎదుర్కొన్నా . . జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే ప్రభుత్వాలు ఏర్పడలేని . . స్థిరంగా నిలబడలేని పరిస్థితి తీసుకుకెచ్చి జాతీయ పార్టీగా తెలుగు ప్రజల గర్వంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ .
కిలో బియ్యం రెండు రూపాయలు . . మహిళలకు డ్వాక్రా పథకం వంటి అద్భుత పథకాలతో పేద ప్రజానీకానికి వెలుగు తెచ్చింది తెలుగుదేశం పార్టీ . తెలుగుదేశం పార్టీ పథకాలు తరువాత జాతీయ స్థాయి పథకాలుగా మారిపోయాయి అంటే . . టీడీపీ ముద్ర గురించి అర్ధం చేసుకోవచ్చు . ప్రజల సంక్షేమంపై తెలుగుదేశం పార్టీకి ఉన్న కమిట్మెంట్ అర్ధం చేసుకోవచ్చు .
ఎన్టీఆర్ ఆశయాలే తోడుగా.. 43 ఏళ్లుగా పార్టీని చెక్కు చెదరకుండా నడిపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అధికారం ఉన్నా . . లేకపోయినా . . పార్టీని వదిలిపోతూ బురదజల్లి టీడీపీ ప్రాభవాన్ని తగ్గించాలని కొందరు ప్రయత్నించినా.. అధికారంలోకి వచ్చిన పార్టీ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినా . . ఆఖరుకు నిష్కారణంగా రాజకీయ కక్షతో జైలు పాలు చేసినా . . మొక్కవోని ధైర్యంతో టీడీపీ పార్టీని ప్రజల పార్టీగా . . ప్రజల మద్దతుతో నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా.. తెలుగోడి గుండెచప్పుడికి ఆనవాలుగా తెలుగుదేశం పార్టీ వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది.
మద్రాసి ముద్రను చెరిపేసి పార్టీ..తెలుగోడి గర్వం తెలుగుదేశం.. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహా వంశీ ఎనాలిసిస్ వీడియో ఇక్కడ చూడండి.
