Mad Square: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కలిసి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ “మ్యాడ్ స్క్వేర్” బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2023లో సూపర్ హిట్ అయిన “మ్యాడ్” సీక్వెల్‌గా వచ్చి, రిలీజ్‌కు ముందు నుంచే అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్‌లోనూ బంపర్ బుకింగ్స్ సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు ఊహించని ఓపెనింగ్స్‌తో దుమ్మురేపుతోంది.
Also Read: Trisha: పెళ్ళికి రెడీ అయిన త్రిష?
Mad Square: ఇక మొదటి రోజు కలెక్షన్స్ ఏంటో చూస్తే.. నిజంగా షాక్ అవ్వాల్సిందే.. అదిరిపోయే విషయం ఏంటంటే.. ఒక్క రోజులోనే “మ్యాడ్ స్క్వేర్” మొత్తం 5.27 కోట్ల షేర్ సాధించింది. అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 10 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని స్పష్టమవుతోంది. టైర్-2 హీరోల జాబితాలో ఇంత సెన్సేషనల్ ఓపెనింగ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.. ఇది ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక, ఈ ఊపుతో “మ్యాడ్ స్క్వేర్” బాక్సాఫీస్ జర్నీ ఎటు వెళ్తుంది? రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయి? వేచి చూడాల్సిందే!
మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి పూర్తి వీడియో సాంగ్ :

