TDP Formation Day

TDP Formation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం… పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్‌..

TDP Formation Day: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పళ్లా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు: “1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, ప్రజల హక్కుల కోసం పోరాడే వేదికగా స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఎంతో ఆనందదాయకం.”

ఇది కూడా చదవండి: Massive Earthquake: భయానక భూకంపం.. పదివేల మరణాలు?

నాటి నుండి నేటి వరకు ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, టీడీపీ నాయకత్వానికి, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కలిసి పొత్తు ఏర్పాటు చేసి, కేంద్రంలోని ఎన్డీయే కూటమితో కలిసి భారీ విజయాన్ని సాధించడం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన కొనసాగించాలని అభిలషిస్తూ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *