NaraLokesh: సామాన్యంగా ప్రజలు ఏదైనా సమస్యతో అధికార పక్షంలో ఉన్న నాయకుల వద్దకు వెళితే.. పరిశీలించి, ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చేస్తామని చెప్తుంటారు. అదే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల వద్దకు వెళితే.. మన పార్టీ అధికారంలోకి రాగానే నీ సమస్యను సాల్వ్ చేస్తాం అని మాటలు చెప్పి ఊరిస్తుంటారు. కానీ ఒక నాయకుడు… ఆపద వచ్చిందన్నా అని ఎవరైనా సోషల్‌మీడియాలో ఒక రిక్వెస్ట్ పెట్టుకోగానే.. వీలైతే ప్రభుత్వ వ్యవస్థల ద్వారా పనిచేయించడమో, అంత సమయం లేదనుకుంటే తన సొంత నిధులతోనే వారిని ఆపద నుండి గట్టెక్కించడమో చాలా చాలా అరుదు.
ఆ చేస్తున్నది ఎవరంటే.. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన్ని కలవనవసరం లేదు. ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించాల్పిన పనిలేదు లేదు. ‘ఎక్స్’లో ఒక్క పోస్ట్ చేసి.. దానికి లోకేష్ అఫీషియల్ ఖాతాని ట్యాగ్ చేస్తే చాలు. సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కొందరి జీవితాల్లో అద్భుతాలే జరుగుతున్నాయి. లోకేష్ ఎంచుకున్న ఈ పంథాలో అసలు సిసలైన పొలిటికల్ హీరోయిజాన్ని చూస్తున్నారు సామాన్య ప్రజలు.
సమస్యలు పరిష్కరించడంలో లోకేష్ వేగం, స్పందిస్తున్న విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. గుంటూరు రమేష్ ఆస్పత్రిలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ యువతి బ్రెయిన్ డెడ్ కాగా, ఆమె తల్లిదండ్రులు ఆర్గాన్ డొనేషన్‌కు అంగీకరించారు. ఆస్పత్రి బృందం ఆర్గాన్లను వివిధ ఆస్పత్రులకు పంపేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో ఆ యువతి ఆర్గాన్లు నలుగురు, ఐదుగురికి ప్రాణం పోశాయి. కానీ గుండె తరలింపు విషయంలోనే సమస్య తలెత్తింది. తిరుపతిలో గుండె మార్పిడికి సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి… ఈ గుండె చేరాలంటే మామూలుగా అయితే గంటల సమయం పట్టేది.
Also Read: Ambati Rayudu: ఆర్సీబీని మళ్లీ ఎగతాళి చేసిన రాయుడు!
NaraLokesh: అంత సమయం ఆర్గాన్‌ను సజీవంగా ఉంచడం అసాధ్యం. ఈ క్లిష్ట సమయంలో రమేష్ ఆస్పత్రి సిబ్బంది.. మంత్రి నారా లోకేష్‌కు సందేశం పంపారు. క్షణాల్లో స్పందించిన లోకేష్, తన సొంత నిధులతో.. విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఆస్పత్రికి గ్రీన్ చానల్ సౌలభ్యం కల్పించేలా అధికారులతో సమన్వయం చేశారు. లోకేష్ తీసుకున్న వేగవంతమైన చర్యతో ఒక ప్రాణం నిలబడింది. ఇప్పుడు ఇటు ఆర్గాన్ దానం చేసిన యువతి కుటుంబం, అటు ఆ ఆర్గాన్ని పొందిన వ్యక్తి కుటుంబం.. ఇద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
