CA Exams: ఏ పరీక్షా విధానంలో సమూల మార్పులు వచ్చాయి. ఇకపై ఏడాదికి మూడుసార్లు ఫైనల్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుంది. ఈ CA పరీక్ష 3 దశల్లో నిర్వహిస్తారు. బేసిక్, ఇంటర్మీడియట్ అలాగే ఫైనల్.
ఇందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఆడిటర్లు కాగలరు. ఇంటర్ మీడియట్ తరువాత బేసిక్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అదే డిగ్రీ పూర్తి చేసిన వారు బేసిక్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ అదేవిధంగా ఫైనల్ పరీక్షలకు హాజరు కావాలి.
Also Read: IPL: ఐపీఎల్ 2025: లక్నో సూపర్ జెయింట్స్ విజయం
CA Exams: ప్రస్తుతం, CA పరీక్షా విధానంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఇకపై ఏడాదికి మూడుసార్లు ఫైనల్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గతంలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించే సీఏ పరీక్షను ఇకపై జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించనున్నారు.
విద్యార్థులకు అదనపు అవకాశాలను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది.

