Pawan Kalyan: ఇకనుంచి ప్రతివారం పిఠాపురం పై సమీక్ష..

Pawan Kalyan: పిఠాపురం పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు ప్రారంభించారు కార్యాచరణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు ప్రారంభించారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధిపై ప్రతి వారం సమీక్ష సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

పోలీసు వ్యవస్థపై దృష్టి:

పట్టణంలోని శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్‌ స్టేషన్ల పరిస్థితులపై సమగ్ర వివరాలతో ఇంటెలిజెన్స్ నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అవినీతిపై ఆగ్రహం:

పోలీసు వ్యవస్థలో అవినీతికి పాల్పడుతున్న కొందరి కారణంగా పోలీసు శాఖ చులకన అవుతున్న పరిస్థితి తట్టుకోలేనిదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణ:

ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు తమ విధుల్లో చురుకుగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరగడం ఎంతో అవసరమని, దానికి అనుగుణంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పిఠాపురం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్స్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *