Aishwarya Rai

Aishwarya Rai: ఐశ్వర్యరాయ్‌ కారును ఢీ కొట్టిన బస్సు!

Aishwarya Rai: ముంబైలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అది చూసిన పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో ఐశ్వర్యా రాయ్ కారులో లేరని సమాచారం. పెద్ద ప్రమాదమేమీ చోటుచేసుకోలేదని ఐశ్వర్యా రాయ్ టీమ్ స్థానిక మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది. ఐష్ సురక్షితంగానే ఉన్నారని.. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని తెలిపారు. దీంతో ఐష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *