Sampoornesh Babu: ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈసారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ అనే ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు.చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ 11న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి విడుదల కాబోతుంది. మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
