Nani: న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో నాని రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి, ప్రేక్షకుల్లో ఆశ్చర్యం, ఆసక్తిని రేకెత్తించాడు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండటంతో అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం, అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. తాజాగా నాని వైల్డ్ లుక్‌లో ‘365 Days/రోజులు.’ అనే క్యాప్షన్‌తో పోస్టర్ వదిలారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
365 Days/రోజులు.#TheParadise pic.twitter.com/jITmj1Cq9e
— Nani (@NameisNani) March 26, 2025