JAAT: బాలయ్య బాబు ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో ‘జాట్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో సన్నీ డియోల్ సరసన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు.వినీత్ కుమార్ సింగ్, రణదీప్ హుడా, జగపతిబాబు, రమ్యకృష్ణ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి..ఇక ట్రైలర్ ని రిలీజ్ చేయగా, దీనికి కనీ వినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ వస్తుంది.ఈ ట్రైలర్లో సన్నీ డియోల్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. పవర్ ఫుల్ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లోని ప్రతి ఎలిమెంట్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా అనిపిస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా వచ్చే నెల అంటే ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.
