Cm revanth : MMTS రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్రచేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగిందని చెప్పారు వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపారని గుర్తుచేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో..
బీఆర్ఎస్ నేత కుమారుడు ఉన్నా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. MMTS ఘటనపై మేం వెంటనే స్పందించామన్నారు. కేసీఆర్ కుటుంబంలో పోటీ రాష్ట్రానికి శాపమని అన్నారు. వాళ్లు కోరుకున్నట్టు ఎన్నికలు రావని చెప్పారు. పద్మారావు, కృష్ణమోహన్, యాదయ్య వచ్చి మాట్లాడారని కేసీఆర్ కలిసినా గజ్వేల్ అభివృద్ధిపై మాట్లాడతానని అన్నారు. మేం వివక్ష చూపించమని అన్నారు. మమ్మల్ని బద్నాం చేయడం మానుకోవాలని సూచించారు. గతంలో కాగితపు బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు.
గతంలో కాగ్ మందలించినా బీఆర్ఎస్ ప్రభుత్వం మారలేదని చెప్పరం చేసిందే చెబుతాం.. చేసేదే చెబుతామని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. కాగా, ప్రస్తుతం సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హై ఓల్టేజ్ గా నిలిచాయి.
