Egg Shells

Egg Shells: గుడ్డు పెంకుల అద్భుతమైన ఉపయోగాలు

Egg Shells: గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అనేది అందరికీ తెలిసిందే. అయితే, ఎక్కువ మంది గుడ్డు పెంకులను ఉపయోగించకుండా పారేస్తుంటారు. కానీ అవి కూడా ఆరోగ్యానికి ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. గుడ్డు పెంకుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, రాగి, ఐరన్ వంటి శరీరానికి అవసరమైన ఖనిజాలు ఉంటాయి. దీంతో వీటిని పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

గుడ్డు పెంకుల వినియోగాలు
1. ముఖానికి ఫేస్ ప్యాక్
గుడ్డు పెంకులను పొడిచేసి ఒక టీస్పూన్ తీసుకుని, అందులో తేనె కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం మెరిసేలా మారుతుంది.

2. జుట్టు కోసం హెయిర్ ప్యాక్
పొడి చేసిన గుడ్డు పెంకులను పెరుగుతో కలిపి జుట్టుకు పట్టిస్తే, జుట్టు మెరుస్తుంది. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఉండనిచ్చి, తర్వాత కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

3. కాల్షియం సప్లిమెంట్
గుడ్డు పెంకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అరకప్పు పొడిలో 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. దీనిని తగిన పరిమాణంలో తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

4. దంతాల కోసం టూత్‌పేస్ట్
గుడ్డు పెంకుల పొడిలో కొద్దిగా బేకింగ్ సోడా, కొబ్బరి నూనె కలిపి పళ్లను తోముకుంటే, దంతాలు తెల్లగా మారటమే కాకుండా బలంగా కూడా ఉంటాయి.

Also Read: Hair Care Tips: 30 దాటితే.. మీ జుట్టు పట్ల ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి

5. మొక్కలకు సహజ ఎరువు
గుడ్డు పెంకుల పొడిని నాటే సమయంలో నేలలో కలిపితే మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. కాల్షియం లోపం వల్ల మొక్కల ఆకులు పాడైపోవడం నివారించవచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sai Pallavi: ఎల్లమ్మ’గా అలరించబోతున్న సాయిపల్లవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *