Chhaava in Parliament: ఈ సంవత్సరం బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిస్టారికల్ హిట్ గా నిలిచిన చిత్రం “ఛావా”. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయుల్ని ఉద్వేగానికి లోను చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది.ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు మరో హిస్టారికల్ మూమెంట్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ని భారతదేశ పార్లమెంట్ లో వేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చ్ 27 గురువారం సాయంత్రం 6 గంటలకి ఛావా ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్ కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది.అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్ లో సినిమాని చూడనున్నారట. దీనితో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
