Nalgonda: సరదాగా ఈత కొట్టేందుకు కుంటలోకి దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నల్గొండ మండలం ముషంపల్లి పరిధిలోని రసులూరుకు చెందిన చింతపల్లి రాఘవేంద్ర, వెలుగుపల్లికి చెందిన నలుపరాజు నవీన్‌కుమార్, నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన కడెం తరుణ్ స్నేహితులు.
వీరు ఏపూర్ గ్రామ శివారులోని డీఈసీ కంపెనీలో ఎలక్ట్రీషియన్స్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కంపెనీ పరిధిలోనే ఓ నీటి కుంట కనిపించడంతో ఈత కొట్టేందుకు నవీన్ దూకాడు. రాఘవేంద్ర, తరుణ్‌ను కూడా రావాలని పిలవడంతో వారికి ఈత రాకపోయినా నీటిలోకి దిగారు. రాఘవేంద్ర నీటిలో మునిగిపోతుండడంతో అతడిని కాపాడేందుకు నవీన్ ప్రయత్నించాడు.
Also Read: Chhattisgarh: ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో రాష్ట్రపతి ప్రసంగం.. రాష్ట్ర ప్రజలకు ప్రశంసలు
Nalgonda: ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. తరుణ్ చేతికి ఓ ప్లాస్టిక్ పట్టా అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే కంపెనీలోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కుంట వద్దకు చేరుకొని రాఘవేంద్ర, నవీన్ డెడ్‌బాడీలను బయటకు తీశారు.
