తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆవర్తనం అండమాన్ సముద్రప్రాంతంలో సగటున సముద్రమట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది.
దీంతో ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
రేపు ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే, సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది
.