Medchal-Malkajgiri:

Medchal-Malkajgiri: తెలంగాణ‌లో పంచాయ‌తీలే లేని జిల్లా గురించి తెలుసా?

Medchal-Malkajgiri: గ్రేట‌ర్ హైద‌రాబాద్ రూపురేఖ‌లు మార్చే క్ర‌మంలో ఓ జిల్లాలో గ్రామ పంచాయ‌తీలే లేకుండా పోతున్నాయి. ఇప్ప‌టికే చాలా గ్రామ పంచాయ‌తీలు ప‌ట్ట‌ణాలుగా మార‌గా, ఆ ప‌ట్ట‌ణాలు చాలావ‌ర‌కు కార్పొరేష‌న్లుగా మార్పు చెందాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ‌ పంచాయ‌తీలే లేని జిల్లాగా మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి జిల్లా మార‌బోతున్న‌ది. ఈ జిల్లా ప‌రిధిలో ఉన్న ప్రాంతాలు కూడా చాలా వ‌ర‌కు ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోనే అధికంగా ఉండ‌టం విశేషం.

Medchal-Malkajgiri: మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్లా ప‌రిధిలో ఉప్ప‌ల్‌, మల్కాజిగిరి, కూక‌ట్‌ప‌ల్లి, కుత్భుల్లాపూర్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు, తొమ్మిది మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేష‌న్లు మిన‌హా 62 మాత్ర‌మే గ్రామాలు ఉండేవి. గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో 28 గ్రామాల‌ను వాటి స‌మీపంలో ఉండే మున్సిపాలిటీల‌లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో మూడు మున్సిపాలిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ మేర‌కు వీటి ప‌రిధిలో 31 గ్రామాల‌ను విలీనం చేస్తూ శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేసింది. ఇక మిగిలిన మూడు గ్రామాల‌ను కూడా స‌మీప‌ మున్సిపాలిటీలో క‌లిపేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

Medchal-Malkajgiri: ఈ నేప‌థ్యంలో మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్లాలో గ్రామ పంచాయ‌తీలు ఇక ఉండ‌వ‌న్న‌మాట‌. దీంతో జిల్లాల‌కు వ‌చ్చే జిల్లా ప‌రిష‌త్ నిధుల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న‌ది. ఆ నిధులు ఇక నుంచి ఆగిపోనున్నాయి. ఇదే ద‌శ‌లో ఉపాధి హామీ ప‌నులు కూడా నిలిచిపోనున్నాయి. దీంతో పేద‌లకు కొంత‌కాలం ఇబ్బందులు క‌ల‌గ‌నున్నాయి. అభివృద్ధి విష‌యంలో కూడా మున్సిపాలిటీల‌లో క‌లిసే గ్రామాల్లో కూడా స‌త్వ‌ర ప‌నుల‌కు కొంత ఆటంకం క‌లుగుతుంది.

కొత్త మున్సిపాలిటీలు.. విలీన‌మ‌య్యే గ్రామాలు
Medchal-Malkajgiri: అలియాబాద్‌: అలియాబాద్ తుక్క‌ప‌ల్లి, లాల్గ‌డి మ‌ల‌క్‌పేట‌, మజీదూర్‌, ముర హ‌రిప‌ల్లి, యాచారం, పొన్నాల‌ ఎల్లంపేట : ఎల్లంపేట శ్రీరంగ‌వ‌రం, బండ మాధారం, నూత‌న‌క‌ల్‌, మైసిరెడ్డిప‌ల్లి, కోనాయ‌ప‌ల్లి, సోమ‌వారం, రావ‌ల్‌కోల్‌, డ‌బిల్‌పూర్‌, రాజ్ బొల్లారం, ఘ‌న్‌పూర్‌, సైదోని తండా, లింగాపూర్‌
మూడు చింత‌ల‌ప‌ల్లి: మూడు చింత‌ల‌ప‌ల్లి, లింగాపూర్‌, ఉద్దెమ‌ర్రి, దేశ‌వ‌రం, నాగిశెట్టిప‌ల్లి, కొల్లూరు, నారాయ‌ణ‌పూర్‌, పోతారం, తారం, ల‌క్ష్మాపూర్‌, అద్రాస్‌ప‌ల్లి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kavita: కాంగ్రెస్ అలవిమాలిన హామీలు ఇచ్చింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *