Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వరుసగా బెదిరింపులు వస్తుండటంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. ఆ మధ్య హర్యానా పాప్ సింగర్ ను కాల్చి చంపిన బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీనీ చంపేసింది. దీంతో ఈ గ్యాంగ్ ఎంతకైనా తెగిస్తుందనే నమ్మకం బలపడింది. దాంతో ఇప్పటికే ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్న సల్మాన్ ఖాన్ మరో కారును కొనుగోలు చేస్తున్నాడట. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్ షో’లో పాల్గొనక పోవచ్చునని కొందరు భావించారు. అయితే వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ సల్మాన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బట్… సల్మాన్ ఉన్నంత సేపు సెట్ లో భద్రతా సిబ్బంది ఎంతో అప్రమత్తంగా ఉందట. ప్రతి ఒక్కరినీ స్కృటినీ చేసి కానీ లోపలకు పంపలేదని, టీమ్ మెంబర్స్ తప్ప కొత్తవారిని అలౌవ్ చేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా సిద్ధిఖీ హత్య తర్వాత నుండి సల్మాన్(Salman Khan) దిన దిన గండం గానే రోజులు గడుపు తున్నారు.
సల్మాన్ – బిష్ణోయ్ మధ్య వివాదం ఇదీ . .
లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) సన్నిహితుడు సంపత్ నెహ్రాను పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అప్పుడు మొదటిసారిగా లారెన్స్ బిష్ణోయ్ పేరు జాతీయస్థాయిలో వెలుగులోకి వచ్చింది. లారెన్స్ సల్మాన్ ఖాన్(Salman Khan) ను టార్గెట్ చేసి.. అతని కదలికలను తెలుసుకోవడానికి సంపత్ ను వినియోగించాడు. ఆ విషయం పోలీసులకు సంపత్ వెల్లడించాడు. లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన వాడు. రాజస్థాన్ లో బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు చాలా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరు కృష్ణ జింకలని పరమ పవిత్రంగా భావిస్తారు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడు అని తెల్సిన లారెన్స్ బిష్ణోయ్ అతన్ని టార్గెట్ చేసుకున్నాడు.
లారెన్స్ బిష్ణోయ్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ మొదలైన రెండు డజన్లకు పైగా కేసులు ఉన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన క్రైమ్ సిండికేట్ మే 2022లో పంజాబీ కళాకారుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కాల్పులకు బాధ్యత వహించాడు, అయితే ఇందులో బిష్ణోయ్ క్రియాశీల ప్రమేయం అనుమానంగానే మిగిలింది.

