Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హరీష్ రావు..

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కీలక భేటీ జరగింది. హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రి పద్మారావు గౌడ్ కూడా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సుమారు పావుగంటపాటు జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

సికింద్రాబాద్ సమస్యలపై చర్చ

సికింద్రాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లు హరీశ్ రావు తెలిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, సీతాఫల్‌మండిలో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 32 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఎన్నికల నియమావళి కారణంగా ఆ నిధులు నిలిచిపోయాయని వివరించారు.

నిధుల విడుదలపై విజ్ఞప్తి

ఆ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరడానికే ముఖ్యమంత్రిని కలిసినట్లు హరీశ్ రావు తెలిపారు. తన నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు పద్మారావు గౌడ్ తనతో పాటు వెళ్లారని ఆయన స్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *