Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు, సుకుమార్ లతో బ్యాక్ టూ బ్యాక్ భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి చరణ్ నుంచి ఈ రెండే కనిపిస్తుండగా నెక్స్ట్ సినిమాలు ఏంటి ఎవరితో అనేవి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయనున్న సినిమా కూడా ఒకట ఉందని కొన్నాళ్ల నుంచి రూమర్స్ ఉన్నాయి.మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై తాజాగా న్యూస్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని, కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని టేకప్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరు ఆల్రెడీ లోకేష్ తో కొన్ని సినిమాలు సైన్ చేసుకోగా అందులో ఒకటి గ్లోబల్ స్టార్ తో కూడా ఉంటుందని టాక్. మరి ఈ కలయిక ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజం అయితే మాత్రం మరో లెవెల్లో ఈ సినిమా ఉండొచ్చు.
