Jack

Jack: మురిపిస్తున్న ముద్దు పాట!

Jack: సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా మరో పాటను విడుదల చేసారు మేకర్స్. భాగ్యనగరం అంతా.. అంటూ ముద్దు కోసం సాగిన ఈ సాంగ్ ఎంతగానో మురిపిస్తుంది. ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీత అందించాడు. ఇక ఈ పాటని సనారే రాయగా జావేద్ అలీ, అమల చేబోలు పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ఇటీవల 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధూ ‘జాక్’ సినిమాతో ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jurala Praject: ఖ‌రీఫ్ రైతుల‌కు శుభ‌సూచికం.. పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరువ‌లో జూరాల‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *