Pawan Kalyan: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి తాజాగా హౌస్ ఆఫ్ కామన్స్ – యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యుకెకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా, పలువురు యూకే పార్లమెంట్ సభ్యులు మెగాస్టార్ ని సన్మానించడం జరిగింది.ఇక ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు.
Also Read: Betting Apps: రోజుకో మలుపు తిరుగుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఫిల్మ్ చాంబర్ సీరియస్
Pawan Kalyan: దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పద్మశ్రీ, పద్మ విభూషణ్, డాక్టరేట్, గిన్నిస్ బుక్ రికార్డ్.. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు మన మెగాస్టార్. ఇప్పుడు యూకే పార్లమెంట్ లో లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు అందుకోని మరో ఘనత సాధించారు చిరంజీవి.
దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు మెగాస్టార్ కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే దీనిపై చిరంజీవి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ X లో ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.