Ee Nagaraniki Emaindi 2: “ఈ నగరానికి ఏమైంది”. విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం అప్పట్లో అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా నెమ్మదిగా కల్ట్ క్లాసిక్ అయ్యింది. పైగా రీరిలీజ్ చేస్తే ఒరిజినల్ రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఎప్పటినుంచో దీని సీక్వెల్ కి మంచి డిమాండ్ నెలకొంది. తాజాగా మేకర్స్ సీక్వెల్ ని కన్ఫర్మ్ చేశారు.
Also Read: Ram Pothineni: రామ్ ‘సాగర్’ ఎంతవరకు వచ్చింది?
Ee Nagaraniki Emaindi 2: ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పేశారు. తెలుగు కొత్త ఏడాది ఉగాదితో సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే లేటెస్ట్ గా ‘ఈ’ అంటూ తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ బాగా వైరల్ గా మారింది.
‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలె’ అంటూ ఈ నగరానికి ఏమైంది విశ్వక్ సేన్ సింబల్ నల్ల కళ్లద్దాలు పెట్టి మరీ పోస్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఈ సినిమా షూటింగ్ హింట్ కూడా కావచ్చు. ఇక సీక్వెల్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.