Hyderabad: పబ్‌లో ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అవతలి వైపు ఆయన భార్య ఫోన్ ఎత్తింది. పోలీసుల మాటలతో ఆగానమేఘాన స్టేషన్‌కు చేరుకున్నది. తీరా పోలీసులు పబ్‌లో యువతులతో పాటు నీ భర్త దొరికాడు.. అని చెప్పగానే ఆ యువతి అవాక్కయింది. ఇక్కడే ఉండు.. ఇంటికొస్తే నీ సంగతి చెప్తా.. అంటూ కన్నీటిభారంతో రుసారుసా వెళ్లిపోయింది. ఇది హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ కుటుంబ బంధాలనూ విచ్ఛిన్నం చేసేదాకా దారితీస్తున్నది అనడానికి నిదర్శనం.
Hyderabad: వికృత చేష్టలకు అలవాటు పడిన ఎందరో తమ కుటుంబాలను వదిలేసి పబ్‌లలో కాలక్షేపం చేస్తూ ఇల్లు గుల్ల చేసుకుంటూ, శరీరాలను పాడుచేసుకుంటున్నారు. ఈ కోవలోనే హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ పబ్‌పై గత అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడి చేశారు. కొందరు ఇచ్చిన సమాచారంతో ఈ దాడి జరిగింది.
Hyderabad: ఈ దాడిలో అందరూ ఆశ్చర్యపోయేలా 42 మంది యువతులు, 140 మంది యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ యాజమాన్యాలు ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మద్యం తాగే వారికి ఎక్కువ బిల్లు వచ్చేలా యువతులకు కమీషన్ ఇచ్చి, అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తేలింది.
Hyderabad: పోలీసుల అదుపులో ఉన్న ఈ 182 మంది యువతీ యువకుల కుటుంబాలకు ఫోన్లు చేసి రప్పిస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మరోసారి జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలోనే పైన చెప్పుకున్న భార్యాభర్తల విషయం బయటపడింది. ఈ కుటుంబం ఒక్కటే కాదు.. ఇతర కుటుంబాలు కూడా గోడుగోడున ఏడ్చుకుంటూ, హెచ్చరిస్తూ తమ పిల్లలకు బాగోగులు చెప్పసాగారు.