బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.వివరాల్లోకి వెళితే..బిహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఓ బోలెరో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గ్రామస్థులపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.
మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

