Beeda Ravichandra

Beeda Ravichandra: బీద ఆ ఒక్క బ్యాడ్ నేమ్‌ పోగొట్టుకుంటారా?

Beeda Ravichandra: టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక పెదబాబు, చినబాబులు తమను నమ్ముకున్నోళ్లకు, పార్టీ వీర విధేయులకు సాధ్యమైనంత మేర పదవులు, హోదాలు, పోస్టులు, ఇస్తున్నారు. ఈ రూట్ లోనే తాజాగా ఎమ్మెల్యే కోటా లిస్టులో ఆ బీసీ లీడర్ ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు. హేమాహేమీలు, జనబలం, ఆర్దిక బలం, సొంత వర్గం ఫుల్లుగా ఉన్నలీడర్స్ చాల మంది ఈ ఎమ్మెల్సీ పదవికి పోటీ పడ్డా కూడా పెదబాబు, చినబాబుల గుడ్ లుక్స్‌తో, ఆశీస్సులతో ఆ బీసీ లీడర్ సుడి తిరిగి ఎమ్మెల్సీ అయిపోయారు. ఇక్కడ వరకు ఓకే కానీ… ఎమ్మెల్సీ పదవి పొందిన ఆ బీసీ లీడర్ ఇకనైనా తనకున్న పాత చెడ్డ ఇమేజ్‌ని పోగొట్టుకుంటారా లేదా అని ఆ జిల్లాలో హట్ టాపిక్‌గా డిస్కషన్ నడుస్తోందట. బ్లాక్ స్పాట్‌ని ఎదుర్కొంటున్న ఆ బీసీ లీడర్‌, తాజా ఎమ్మెల్సీ ఎవరో తెలియాలంటే లెట్స్‌ వాచ్ దిస్‌ స్టోరీ‌.

పెద్దా రెడ్ల అడ్డా అయిన నెల్లూరు జిల్లాలో తన శక్తికి మించి, అంగ, అర్ద బలాలు ఉపయోగిస్తూ, కష్టాలు, నష్టాలు భరిస్తూ.. పాతికేళ్లకు పైగా పసుపు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న బలహీనవర్గాల లీడర్‌గా బీద రవిచంద్ర యాదవ్ పేరు తెచ్చుకున్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అలాంటి బీద రవిచంద్ర యాదవ్‌కు నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, రెండోసారి టిడిపి అధికారంలోకి వచ్చాక, సెకండ్ టైమ్ ఎమ్మెల్సీ పదవి దక్కింది. బీద రవిచంద్ర యాదవ్‌కి… రాజ్యసభ ఇచ్చినా, కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాల్లో చోటు కల్పించినా కూడా… వాటికి సరితూగే స్థాయి ఆయనది అంటుంటారు తెలుగుదేశం పార్టీలో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైమ్ నుండి గత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి హయాం వరకూ.. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోసం ఆర్థికంగా, అనేక విధాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బీద రవిచంద్ర.!!

తన అన్న బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిపోయి.. తననీ వైసీపీలో చేరిపొమ్మని, లేదంటే వ్యాపారాల్లో స్థానం ఉండదనీ తీవ్ర ఒత్తిడి తెచ్చినా పసుపు జెండా వదల్లేదనీ, జిల్లాలో తన సహచర నేతలే ఎన్నికల పేరిట కోట్లలో ఎగనామం పెట్టినా.. సొంత ఆస్తులు అమ్మి అప్పులు కట్టుకున్నారు తప్ప పార్టీపై అభిమానాన్ని ఏనాడు వదులుకోలేదని చెప్తుంటారు బీద రవించయాదవ్‌ దగ్గరి వ్యక్తులు. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో బీద రవిచంద్ర కాలు విరిగింది. అయినా వీల్ ఛైర్ లోనే యువగళంలో పాల్గొని టీడీపీపై తన కమిట్మెంట్‌ని ప్రూవ్ చేసుకున్నారు.

చావో బతుకో అన్న లెవల్‌లో జరిగిన 2024 ఎన్నికల్లో సుమారు ఏడాది పాటూ ఆంధ్రా అంతటా విపరీతంగా తిరిగారు బీద రవిచంద్ర యాదవ్‌. యువగళం పాదయాత్ర ప్లానింగ్‌లో కీలకంగా వ్యవహరించారు. కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ అభ్యర్దుల ఎంపికలో అత్యంత కీలకమైన రిపోర్టులు ఇవ్వడం, తిరుగుబాట్లు సర్దుబాటు చేయడం, ఆర్థిక వనరులు సమకూర్చడం చేస్తూ.. ఎన్నికలకు ముందు మూడు నాలుగు నెలలు అసలు పూర్తిగా కుటుంబానికి కనబడకుండా తిరిగారట బీద రవిచంద్ర. ఇటు సొంత జిల్లా నెల్లూరులోనూ టీడీపీ గెలుపు బావుటా ఎగరేసేలా చాకచక్యంగా వ్యవహరించారు.

తన సొంత నియోజకవర్గం కావలిలో పోటీ చేసే విషయంలో అనుచరులు, అభిమానుల నుండి విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. తాను పోటీ చేసి ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యేకంటే.. డూ ఆర్‌ డై ఎలక్షన్‌లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని డిసైడ్‌ అయ్యారట. అలా కావలి టికెట్ ఇష్యూని అధినేతకే వదిలేసి పార్టీ పనిలో 24 బై 7 నిమగ్నమైపోయారట బీద రవిచంద్రయాదవ్. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా… ఏ పదవీ ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టిన బీద రవిచంద్రని చూసి.. ఇక ఇతని పనైపోయిందనీ… చంద్రబాబు, లోకేష్‌లు బీద రవిని పక్కన పెట్టేశారనీ.. ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. సీన్‌ కట్ చేస్తే… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలలో ఫస్ట్ పేరు, ఫస్ట్ క్యాడెంట్‌గ బీద రవిచంద్ర యదవ్ పేరు అనౌన్స్ అయ్యింది. చంద్రబాబు, లోకేష్‌లు ఎలాంటి చర్చ, డౌటనుమానం లేకుండా బీద రవి పేరుని లిస్టులో పెట్టేశారట.

ఇది కూడా చదవండి: Ayodhya: అయోధ్య రామాలయంలో రామ్ దర్బార్ ప్రారంభానికి ఏర్పాట్లు

బీద రవిచంద్ర యాదవ్ ప్లస్‌లు, టీడీపీ అంటే ఆయనకున్న చిత్తశుధ్ది గురించి ఇంత చెప్పుకున్నాక… ఆయనకున్న మైనస్‌లు బ్యాక్ డోర్ పాలిటిక్స్‌లో చెప్పరా? అని ఆయన ప్రత్యర్దులు అడగొచ్చు. అక్కడికే వస్తున్నాం. బీద రవిచంద్ర యాదవ్ తనకు అవసరమైన ఫోన్ తప్పించి మరో ఫోన్ అన్సర్ చేయరట. తన యాదవ సామాజివర్గంతో పాటూ సొంత పార్టీలో పట్టుమని 10 మంది సొంత మనుషులను సంపాదించుకోలేక పోయారన్నది ఆయనపై ఉన్న ప్రధానమైన ఒక విమర్శ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై దారుణంగా నోరు పారేసుకున్న, ఇంటికొచ్చి కొడతాం అన్న ఓ లీడర్‌ తాజాగా టీడీపీలో చేరగానే.. తన పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారనీ, ఆయనతో కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారనీ ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

ముఖ్యంగా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన అనుచరులకు… అధికారంలో ఉన్నప్పుడైనా కాంట్రాక్టులు, ఆర్థికంగా బలపడే మార్గాలు చూపకుంటే ఎలా అన్నది ఎప్పుడూ ఆయనకు ఎదురయ్యే ప్రశ్న. బీద రవిచంద్రని నమ్ముకుని.. పార్టీ కోసం ఆస్తులు కరిగించుకుని, కేసులు పెట్టించుకుని తిరుగుతున్న మాలేపాటి సుబ్బా నాయుడు, డాక్టర్ జెడ్‌.శివప్రసాద్, తిరుమలనాయుడు, అమృల్లా ఖాన్, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి… ఇలాగ దాదాపు పాతిక మంది వరకూ ఉన్నా… వారిలో ఎవ్వరికీ ఎలాంటి నామినేటేడ్ పదవులు రాకపోవడం బీద లీడర్షిప్ క్వాలిటీస్‌కే మచ్చ అంటూ ప్రత్యర్దులు ప్రచారం చేస్తున్నారు. లీడర్‌ అంటే నమ్ముకున్న వారికి, అండగా నిలబడ్డ వారికీ, పాత పార్టీ లీడర్లకు సైతం అండగా నిలబడాలని, కష్టకాలంలో సపోర్ట్ చేసిన సొంత మనుషులను అధికారం ఉన్న టైమ్‌లో ఆర్థికంగా నిలబెట్టాలి కానీ… బీద రవి సొంత పనుల్లో బిజీ అయిపోయారని టాక్ ఉంది.

డబ్బున్న వారికే బీద రవి అన్ని పనులు, వ్యవహారాలు చక్కబెడతారన్న ఆరోపణలూ ఉన్నాయి. తన వ్యాపారాలు, తన వ్యవహరాలు చక్కబెట్టుకునేందుకు.. మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ లెవెల్‌ వ్యక్తుల్నే తన సర్కిల్లో ఉంచుకుంటారనీ, సొంత మనుషుల్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వరనే చెడ్డపేరు ఉంది. సొంత నెల్లూరు జిల్లాలో మంత్రులు కూడా బీద రవిపై హ్యాపీగా లేరనీ, ముఖ్యంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి యాంటీగా పని చేసిన వ్యక్తిని.. బీద రవి పక్కన పెట్టుకు తిరుగుతుంటాడని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదే విషయమై బీద రవితో మంత్రి ఆనం నేరుగా గొడవ కూడా పడ్డట్టు ప్రత్యర్దులు గుర్తు చేస్తున్నారు. ఇక మంత్రి నారాయణ కూడా 2019లో ఇచ్చిన ప్రియారిటీ ఇప్పుడు బీద రవికి ఇవ్వడం లేదని… క్యాలిబర్, క్యాపబులిటీ ఉన్న వారిని బీద రవి తన యూజ్ అండ్ త్రో పాలసీతో దూరం చేసుకోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆయన సొంత మనుషులే చెబుతున్నారట. 

బీద రవిచంద్ర యాదవ్ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్టు.. తన పాత బ్యాడ్ ఇమేజ్ నుండి బయటపడతారా? రాబోయే రోజుల్లో మంత్రి పదవి దక్కించుకుంటారా? నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారా? ఇలా చాలా ప్రశ్నలకు కేవలం బీద రవిచంద్ర యాదవ్ తనని తాను మార్చుకుని సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *