అంబానీ చిన్న కోడలి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి..

RadhikaMarchant’s birthday: ప్రముఖ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్‌ తన 30వ పుట్టినరోజు అక్టోబర్‌ 16న ఇంట్లో కేక్‌ కట్‌ చేసి ఘనంగా జరుపుకుంది. బుధవారం రాత్రి రాధిక ముంబయిలోని అంబానీల నివాసం ఆంటీలియాలో ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీలో ఈ వేడుకల్లో సినీ, క్రీడా రంగానికి చెందిన తారలు సందడి చేశారు.

ఎం.ఎస్.ధోనీ, జాన్వీకపూర్‌, సుహానా ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అర్జున్‌ కపూర్‌, శిఖర్‌ పహారియాతోపాటు దర్శకుడు అట్లీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాధికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను బాలీవుడ్‌ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఒరీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహం ఈ ఏడాది జులైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు రూ.5000 కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ప్రపంచదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పెళ్లికి ముందు రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. తరతరాలు చెప్పుకునేలా వీరి పెళ్లి వేడుకలు నిర్వహించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *