Lovers Commit Suicide: కరీంనగర్ జిల్లా బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరూ ప్రేమజంటగా పోలీసులు గుర్తించారు. తొలుత మృతదేహాలను గుర్తించిన పోలీసులకు వారికి చిరునామా వివరాలు తెలియరాలేదు. ఒకరోజు అనంతరం వారి వద్ద ఉన్న ఆధారాలు, పోలీసుల విచారణతో మృతుల వివరాలు దొరికాయి. దీంతో వారిని ప్రేమ జంటగా గుర్తించారు.
Lovers Commit Suicide: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మునుగు రాహుల్ (18), నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత (20)కి మధ్య సామాజిక మాధ్యమాల్లో కొద్దినెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Lovers Commit Suicide: తమ ప్రేమ విషయం తమ ఇండ్లల్లోని పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ భావించారు. దీంతో మనస్తాపంతో ఇద్దరూ మరణించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరూ కలుసుకొని బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ పాపయ్యపల్లె గేట్ వద్దకు చేరుకొని రైలు కింద పడి తనువులు చాలించారు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన ప్రేమ చివరికి విషాదాంతంగా ముగిసింది.