Pradeep: ఫేమస్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఓ వైపు షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తన టాలెంట్ ని పూర్తిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే రొమాంటిక్ డ్రామాతో హీరోగా తెరంగేట్రం చేసిన ప్రదీప్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు.
Also Read: Prabhas Hombale Films: ప్రభాస్ తో హోంబాలే 4వ సినిమా.. దర్శకుడు ఎవరంటే..?
Pradeep: నితిన్ భరత్ దర్శకత్వంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఢీ, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే హొలీ సందర్భంగా.. మూవీని ప్రమోట్ చేస్తూ ప్రదీప్ హీరోయిన్ దీపికతో హొలీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కనిపించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీమ్ నుంచి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు బెస్ట్ జోడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

