Sunita Williams: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో గత 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ల రక్షణ కోసం NASA- స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా Crew-10 మిషన్‌ను చేపట్టింది. వారం రోజుల పరిశోధన కోసం వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమగాములు అనివార్య కారణాలతో అక్కడే ఉండిపోయారు. చివరకు, మార్చి 19న వీరిద్దరూ భూమికి తిరిగి రావడానికి అవకాశం ఉందని NASA అధికారులు వెల్లడించారు.
Crew-10 మిషన్ విజయవంతంగా ISSకి చేరుకుంది
శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా-స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్, Crew-10 మిషన్ ద్వారా నలుగురు కొత్త వ్యోమగాములను ISSకి విజయవంతంగా చేరవేసింది. ఈ మిషన్‌లో అమెరికా, జపాన్, రష్యాలకు చెందిన వ్యోమగాములు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ISSకి చేరుకున్నారు. వీరు అక్కడే కొన్నాళ్లు ఉండి పరిశోధనలు కొనసాగించనున్నారు.
Also Read: A. R. Rahman: మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత
Sunita Williams: మార్చి 13న Crew-10 మిషన్ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, చివరి నిమిషంలో ఫాల్కన్-9 రాకెట్ హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. లోపాన్ని సరిచేసిన తర్వాత, శనివారం Crew-10 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు.
ప్రస్తుతం ISSలో మొత్తం 11 మంది వ్యోమగాములు ఉన్నారు. కొత్తగా వచ్చిన టీమ్‌కు ISS పరిస్థితులను వివరించిన తర్వాత, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ మార్చి 19న Crew-10 మిషన్ ద్వారా భూమికి చేరుకునే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలిస్తే, బుధవారం లోపు ఫ్లోరిడా తీరంలో డ్రాగన్ క్యాప్సుల్ ల్యాండ్ కానుంది. దీని ద్వారా 9 నెలలుగా ISSలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ రక్షణ విజయవంతంగా పూర్తికానుంది.

