Telangana: తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గందరగోళ పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇటీవలే ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. తాజాగా 10,000 మందికి పైగా ఉపాధ్యాయులను భర్తీ చేసింది. మరి ఓ పాఠశాలలో ఆరు తరగతులకు ఇద్దరే టీచర్లు ఉండటానికి కారకులు ఎవరై ఉంటారు. ఏదైతే ఏమి కానీ తమ పిల్లల గతేంకాను అని విద్యార్థుల తల్లిదండ్రలు ఏకంగా బడికే తాళం వేసి పిల్లలతో కలిసి నిరసన తెలిపారు.
Telangana: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పర్వత్‌పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు 66 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవలే ఒక ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లగా, ఒక ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడు మాత్రమే మిగిలారు. వారే అన్ని తరగతులకు పాఠాలు బోధిస్తూ వచ్చారు.
Telangana: ఈ గమ్మత్తును చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు మండిపాటుకు గురయ్యారు. ఇద్దరు ఉపాధ్యాయులు 66 మంది పిల్లలకు పాఠాలు ఎలా బోధిస్తారంటూ ఆగ్రహం చెందారు. అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులు ఎలా చెప్తారని అందరూ బడికి చేరుకున్నారు. ఏకంగా బడికి తాళం వేసి విషయాన్ని ఉన్నతాధికారుల చెవిలో వేశారు.