pragya jaiswal

Pragya Jaiswal: గులాబీలోని కోమలం.. హంసలోని సోయగం ఈ సొగసరి రూపం.. ఫ్యాబులస్ ప్రగ్య..

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ మోడల్ గా, నటిగా బాగా ఫేమస్. ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాలలో ఎక్కువగా నటిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ, వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగు తన నటనకి అవార్డులు కూడా అందుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Pragya Jaiswal

12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జన్మించింది ప్రగ్య జైస్వాల్. ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి కూడా ఈమెకు ఉంది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

Pragya Jaiswal

సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో ఆమె వివిధ అందాల పోటీల్లో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా మారింది. 2014లో కళ మరియు సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందుకుంది. అందాల పోటీ ఫెమినా మిస్ ఇండియా 2008 ద్వారా మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్ మరియు మిస్ ఫ్రెండ్ ఎర్త్ టైటిల్‌లను గెలుచుకుంది.

Pragya Jaiswal

2015లో మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగు డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ… అదే ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రానికి 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్, 5వ SIIMA ఉత్తమ మహిళా అరంగేట్రం (తెలుగు), సినీమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ, 18వ ఉగాది పురస్కారాలు ఉత్తమ మహిళా అరంగేట్రం, జీ తెలుగు అప్సర అవార్డులు, TSR – TV9 జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఉత్తమ తొలి నటి అవార్డులు ఉందుకుంది.

 Pragya Jaiswal

తర్వాత తెలుగు ఓం నమో వెంకటేశాయ అనే ఆధ్యాత్మిక చిత్రంలో మెప్పించింది. తర్వాత జయ జానకి నాయక, అఖండ, ఇటీవల దాకు మహారాజ్ వంటి బ్లాక్ బస్టర్స్  సినిమాల్లో నటించింది.

Pragya Jaiswal

మధ్య మధ్యలో గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర,  సన్ అఫ్ ఇండియా చిత్రాల్లో నటించిన అవి ఆకట్టుకోలేకపోయాయి.  ప్రస్తుతం అఖండ 2 మూవీలో కథానాయకిగా నటిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sree Vishnu: 'సామజవరగమన' సీక్వెల్ రాబోతోందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *