IRCTC Rules

IRCTC Rules: రైలు రిజర్వేషన్ నిబంధనలు మారాయి.. ఇకపై అంత ముందుగా కుదరదు!

IRCTC Rules భారతీయ రైల్వే అడ్వాన్స్  టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మార్చింది. ప్రస్తుతం  ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుకింగ్ ప్రారంభం అవుతోంది. ఇప్పుడు ఈ సమయాన్ని  60 రోజులకు తగ్గించారు. కొత్త నిబంధన నవంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ మార్పు వలన ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యంలో ఎటువంటి మార్పు చేయలేదు. 

IRCTC Rules ప్రస్తుతం, టికెట్ బుకింగ్ IRCTC వెబ్‌సైట్, యాప్, రైల్వే బుకింగ్ కౌంటర్ల ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు IRCTC ద్వారా 12.38 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. నిజానికి 2015 కు ముందు రైలు టికెట్ల రిజర్వేషన్ 60 రోజుల ముందుగా చేసుకునే అవకాశం ఉండేది. దానిని 2015 ఏప్రిల్ నుంచి 120 రోజులకు పెంచారు. అయితే, రిజ్వేషన్ సమయం ఎక్కువగా ఉండడం వల్ల.. క్యాన్సిలేషన్ ద్వారా ఎక్కువ డబ్బు రైల్వే సంపాదిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు రైల్వే శాఖ మళ్ళీ 60 రోజుల ముందుగా రిజర్వేషన్ అనే నిర్ణయం తీసుకుంది. 

IRCTC Rules ఇలా రిజర్వేషన్ వ్యవధి తగ్గించడం వలన.. వడ్డీ, రద్దు ద్వారా IRCTC ఆదాయాలు తగ్గుతాయి. దీని ప్రభావం దాని స్టాక్‌పై కూడా కనిపిస్తోంది. కంపెనీ షేర్లు దాదాపు 2.5% క్షీణించి రూ.870 వద్ద ముగిశాయి. ఒక నెలలో స్టాక్ 6% పడిపోయింది. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.70 వేల కోట్లుగా ఉంది. 

రైల్వే వెయిటింగ్ లిస్ట్‌ను తొలగించే ఆలోచన.. 

  • IRCTC ఇటీవల అనేక మార్పులను చేసింది, రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌ల దీర్ఘకాల సమస్యను తొలగించే ప్రణాళికలతో సహా, ప్రతి ప్రయాణీకుడికి కచ్చితంగా  బెర్త్‌లు ఉండేలా చూడాలని ప్రయత్నిస్తోంది. 
  • రైల్వే సూపర్ యాప్‌ను కూడా ప్రారంభించే ఆలోచన చేస్తోంది. , ఇందులో ప్రయాణీకుల టిక్కెట్ బుకింగ్ నుండి ప్రయాణ ప్రణాళిక వరకు సేవలు ఉంటాయి. AI ఎనేబుల్డ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని రైల్వే యోచిస్తోంది. దీంతో ఆహార నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు రైలు ఆక్యుపెన్సీని కూడా పర్యవేక్షిస్తారు.

1999 నుంచి.. 

IRCTC Rules IRCTC 1999లో భారతీయ రైల్వేలో చేరింది.ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది భారత ప్రభుత్వంలోని రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘మినీ రత్న (కేటగిరీ-I)’ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. IRCTC 27 సెప్టెంబర్ 1999న భారతీయ రైల్వే శాఖగా విలీనం చేశారు. 

స్టేషన్లు, రైళ్లు, ఇతర ప్రదేశాలలో క్యాటరింగ్ అలగే ఆతిథ్యాన్ని నిర్వహించడం దీని లక్ష్యం. దీనితో పాటు, బడ్జెట్ హోటల్స్, ప్రత్యేక టూర్ ప్యాకేజీలు, సమాచార, వాణిజ్య ప్రచారం, ప్రపంచ రిజర్వేషన్ వ్యవస్థ అభివృద్ధి ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. IRCTC కార్పొరేట్ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

IRCTC ప్రధాన కార్యకలాపాలు ఇవే.. 

  • క్యాటరింగ్ – హాస్పిటాలిటీ
  • ఇంటర్నెట్ టికెటింగ్
  • ప్రయాణం మరియు పర్యాటకం
  • ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (రైల్ నీర్)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *