Nidhhi Agerwal

Nidhhi Agerwal: బంపర్ ఆఫర్ కొట్టేసిన నిధి అగర్వాల్!

Nidhhi Agerwal: తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం.ఇక ఈ మూవీలో సూర్య వెనుకబడిన కులానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నాడని టాక్. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉండగా, రెండో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kashmir: పహల్గామ్ దాడిలో దారుణ తీరుగా ప్రవర్తించిన ఉగ్రవాదులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *