Cm revanth: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ. 550 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం రూ. 500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో మహిళల ప్రగతికి ప్రాధాన్యం ఇవ్వాలని, నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే, మహిళా రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా రాజకీయాల్లోనూ వారు చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


