Nara lokesh: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్ పరీక్ష పేపర్ లీక్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, పేపర్ లీక్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. పేపర్ లీక్ కారణంగా బీఎడ్ పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘‘ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం ఎప్పటికీ ఉపేక్షించదు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తాం,’’ అని నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు సమన్వయంతో పని చేసి పరీక్షల గౌరవాన్ని కాపాడాలని ఆయన ఆదేశించారు.