Venkatesh: సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు వసూలు చేసిన వెంకటేష్ తరువాత సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. దాదాపు 20 సినిమా కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి కథను వెంకటేష్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.గత కొంతకాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఒకప్పటి టాప్ ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి కిషోర్ తిరుమల, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కాంపౌండ్ నుంచి మరో యంగ్ డైరెక్టర్.. ఇలా చాలా మంది వెంకటేష్ ని కలిసి కథలు చెప్పారట. వీటిలో దాదాపుగా సురేందర్ రెడ్డి కదా ఫైనల్ అయినట్లుగానే ప్రచారం జరుగుతుంది. అయితే 20 కథలు రిజెక్ట్ చేసిన తర్వాత సురేందర్ రెడ్డి చెప్పిన కథలో ఏముందా అని వెంకటేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ న్యూస్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

