Bengaluru: ఇక నుంచి ఆ వర్శిటీకి మన్మోహన్ సింగ్ పేరు..

Bengaluru: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గౌరవార్థంగా, ఆయన పేరును కర్ణాటక రాజధాని బెంగళూరులోని బెంగళూరు సెంట్రల్‌ యూనివర్సిటీకి (BCU) పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించారు.

మన్మోహన్‌ సింగ్‌ 2024 డిసెంబర్‌ 26న తన 92వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత దేశంలో ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఇదే తొలిసారి. 2017లో స్థాపించిన బెంగళూరు సెంట్రల్‌ యూనివర్సిటీ ఇప్పుడు మన్మోహన్‌ సింగ్‌ పేరుతో గుర్తింపు పొందనుంది.

మన్మోహన్‌ సింగ్‌ ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రసిద్ధి పొందారు. భారతదేశ 13వ ప్రధానిగా ఆయన 2004 నుంచి 2014 వరకు పదవిని నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన ఎనలేని పాత్ర పోషించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *