Kedarnath Dham

Kedarnath Dham: కేదార్‌నాథ్ ధామ్ వెళ్లే భక్తుల కోసం రోప్ వే.. ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం

Kedarnath Dham: కేదార్‌నాథ్ ధామ్ -హేమకుండ్ సాహిబ్ కోసం రోప్‌వే ప్రాజెక్టును కేంద్రం ఆమోదించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 8-9 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం 36 నిమిషాలకు తగ్గిపోతుంది అని చెప్పారు. దీనిలో 36 మంది కూచుని వెళ్లగలిగే ఏర్పాటు ఉంటుంది అన్నారు.

జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం కింద, ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ వరకు (12.9 కి.మీ) అదేవిధంగా గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్జీ వరకు (12.4 కి.మీ) రోప్‌వే నిర్మిస్తారు. నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ దీనిని నిర్మిస్తుంది. కేదార్‌నాథ్‌లో శివుని ఆలయం ఉంది. ఇది సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మందాకిని నది ఉంది. కేదార్‌నాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.

కేదార్‌నాథ్‌లో నిర్మించబోయే రోప్‌వే అత్యంత అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని ద్వారా ప్రతి గంటకు 1800 మంది యాత్రికులను, ప్రతిరోజూ 18 వేల మంది యాత్రికులను రవాణా చేస్తారు.
కేదార్‌నాథ్ చేరుకోవడానికి కనీసం 9 గంటలు పడుతుంది. రోప్‌వే పూర్తయిన తరువాత తర్వాత, 36 నిమిషాల్లో అక్కడికి చేరిపోవచ్చు. గౌరికుండ్ నుండి కేదార్‌నాథ్ ఆలయానికి 16 కిలోమీటర్ల దూరం పైకి వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్నది. ప్రస్తుతం దీనిని కాలినడకన, పల్లకీ, పోనీ, హెలికాప్టర్‌ల ద్వారా చేరుకుంటున్నారు.

Also Read: Google Tara Chip: తారా చిప్: కేబుల్స్ లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్

Kedarnath Dham: గోవింద్ ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ వరకు 12.4 కి.మీ రోప్ వే నిర్మించనున్నారు. దీనికోసం రూ.2,730.13 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రోప్‌వే ప్రతి గంటకు 1,100 మంది ప్రయాణికులను, ప్రతి రోజు 11,000 మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది. హేమకుండ్ సాహిబ్ ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దీని ఎత్తు 15 వేల అడుగులు.

ఇక్కడ ఉన్న ప్రముఖ గురుద్వారా మే నుండి సెప్టెంబర్ వరకు సంవత్సరంలో దాదాపు 5 నెలలు తెరిచి ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *